అగర్ వుడ్  సాగు పరిచయం
అగర్ వుడ్ లేదా అగర్ వుడ్ ఫార్మింగ్ సాగు విధానాల గురించిన సమాచారం దిగువున ఉంది
అగర్ వుడ్ ని దేవుని కలపగా అభివర్ణిస్తారు. అగర్ వుడ్ శాస్త్రీయ నామం ఆక్విలేరియా. ఆక్విలేరియా శాస్త్రీయ నామం రెజినస్ హార్ట్ వుడ్. ఇవి ఆగ్నేయాసియాలో సహజంగా పెరుగుతాయి. ఇది ఆక్విలేరియాకు చెందిన సంక్రామిక కలప. అడవుల్లో కనిపించే ఈ చెట్టు సుమారుగా 40 మీటర్ల ఎత్తు, 80 సెంటిమీటర్ల వెడల్పునకు చేరుతాయి. అడవుల్లో పెరిగే ఈ చెట్టుకి కొన్ని రకాల బూడిద తెగుళ్ళు సోకుతాయి. ఫియాలోఫోరా పారాసిటికాగా పిలిచే  పరాన్న శిలీంధ్రాలు ఏర్పడతాయి. బూజుపడుతుంది. ఈ దాడి చెట్టును దెబ్బతీయదు. కానీ, దాని ప్రభావంతో చెట్టు  హార్ట్ వుడ్ లోపల అగర్ వుడ్ ని తయారు చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇది ఇన్ ఫెక్షన్ కు ముందు వాసన లేనిదిగా ఉంటుంది. ఇన్ ఫెక్షన్ పెరుగుతున్నకొద్దీ హార్ట్ వుడ్ లోపల చిక్కని సర్జరసం తయారవుతుంది. ఆ రసం గట్టిపడి తాపడంగా ఏర్పడేదానిని రెజిన్ అంటారు. ఈ రకమైన కలప చాలా విలువైనది. ఇది అద్వితీయమైన సువాసన ఇస్తుంది. దీన్ని అగరవత్తులు, పరిమళాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఏ రకానికి చెందినది, ఏ ప్రాంతంలో ఉంది, మోడు, కొమ్మలు, వేర్ల మూలాలు, తెగులు సోకిన తర్వాత పట్టిన వ్యవధి, ఈ చెట్ల పెంపకంలో అనుసరించే పద్ధతులు, ప్రాసెసింగ్ ను అనుసరించి దాని సువాసనల్లో మార్పులుంటాయి. అడవుల్లో పెరిగిన ఆక్విలేరియా చెట్లలో సుమారు 10 శాతం చెట్లు సహజంగా రెజిన్ ను ఉత్పత్తి చేస్తాయి.
అగర్ వుడ్ లక్షణాలు, సాధారణంగా పిలిచే పేర్లు
ఆక్విలేరియా ముదురు అగర్ వుడ్ ను కనబరచగానే వేటగాళ్ళు బెరడును తొలగించి చెట్టుకు బూడిద తెగులు సోకేట్లు చేస్తారు. ఈ బెరడు లోపలి కలపను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. హిందీలో కొందరు అగర్ అంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడాల్లో అగురు అంటారు. తమిళంలో అకిల్, అస్సాంలో శశి ఇలా చాలా పేర్లున్నాయి. ఒక కీటకం లోపలకు తొలుచుకు వెళ్ళిన తర్వాత వేర్లలో, చెట్ల మోడులలో అగర్ వుడ్ ఏర్పడుతుంది. వాటిల్లిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు చెట్టు లాభదాయకమైన ఆత్మరక్షణ పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. ఈ ప్రభావితం కాని కలప లేత రంగులో ఉంటుంది. ఇక తెగులు సోకిన కలప ద్రవ్యరాశిని, సాంద్రతను రెజిన్ పెంచి దాని రంగును కూడా మారుస్తుంది. ఆవిరిని ఉపయోగించి అగర్ నుంచి ఔద్ తైలాన్నివడకడతారు. పూజలు పునస్కారాలలో వాడే అగర్ బత్తీ దీని నుంచే తయారవుతుంది. అగర్ వుడ్ రకరకాల ఆవిరి వడకట్టులకు లోనవుతుంది. ఫలితంగా, రకరకాల శ్రేణుల తైలం తయారవుతుంది. వాటి గుణగణాలలో, ధరల్లో కూడా తేడా వస్తుంది. పలుచగా మారని తైలం చర్మంపై ఉపయోగించేందుకు సురక్షితమైనది. ఇది ఉద్దీపకంగా, టానిక్ గా, వాపును నిరోధించేదిగా, జీర్ణక్రియకు తోడ్పడేదిగా, నొప్పినివారిణిగా, కీళ్ళ నొప్పులను నిరోధేంచేదిగా, దురద నుంచి ఉపశమనం కలిగించేదిగా, ఆకలిని పెంచేదిగా, ప్రశాంతపరచేదిగా దేహానికి సాయపడుతుంది.
అగర్ వుడ్ చెట్టు రూపురేఖలు:
·        అగర్ వుడ్, అలోస్ వుడ్ లేదా ఘ్రవుడ్ మందమైన రెజినస్ సువాసనా కలప. దీంతో చిన్న చెక్కబొమ్మలు తయారు చేస్తారు.  అగరువత్తులు, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.
·        అడవులలో ఈ చెట్లు తరిగిపోతుండడం వల్ల అగర్ వుడ్ ధర ఎక్కువగా ఉంది.
·        అగర్ వుడ్ వాసన ఆహ్లాదపరచేదిగా, సంకీర్ణమైనదిగా ఉంటుంది. దీనికి సారూప్యమైనవి కొద్దిగానే ఉన్నాయి. సాటిరాగల సహజ పదార్థాలు లేవనే చెప్పాలి.
అగర్ వుడ్ లో రకాలు:
ఆక్విలేరియా తెగకు చెందిన చాలా చెట్లు సహజంగా లేదా కృత్రిమంగా తెగులుకు లోనైనపుడు అగర్ వుడ్ గా మారతాయి. ప్రపపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈ రకాల చెట్లు ఉన్నాయి. వాటి నుంచి తయారయ్యే అగర్ వుడ్ తైలం గుణగణాలు, స్వరూప స్వభావాలు వేటికవే ప్రత్యేకమైనవి.
ఇంతవరకు 21 రకాల ఆక్విలేరియా చెట్లను గుర్తించారు. అవి ఇవి:
1.ఆక్విలేరియా అపిక్యలేట్ (బార్నియో)
2.ఆక్విలేరియా బైలోనియాయ్ (కంబోడియా, ఇండోచైనా, థాయిలాండ్)
3.ఆక్విలేరియా బనేసిస్ (వియత్నాం)
4.ఆక్విలేరియా బిక్కారియానా (సౌత్ ఈస్ట్రన్ ఏషియా)
5.ఆక్విలేరియా బ్రకయంత (సౌత్ ఈస్ట్ ఏషియా-ఫిలిప్పీన్స్)
6,ఆక్విలేరియా సిట్రినికార్పా (సౌత్ ఈస్ట్ ఏషియా-ఫిలిప్పీన్స్ (మిండానవో
7.ఆక్విలేరియా క్రస్నా (థాయిలాండ్, కంబోడియా, ఇండోచైనా, వియత్నాం, లావో పి.డి.ఆర్, భూటాన్)
8.ఆక్విలేరియా కుమిన్గియానా (ఇండోనేషియా)
9.ఆక్విలేరియా డిసెంకోస్టాట (ఫిలిప్పీన్స్)
10. ఆక్విలేరియా ఫిలారియల్ (ఇండోనేషియా)
11. ఆక్విలేరియా హిర్టా (మలేషియా, ఇండోనేషియా)
12. ఆక్విలేరియా ఖసియానా (ఇండియా)
13. ఆక్విలేరియా మలాసెన్సిస్ (లావో పి.డి.ఆర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, భూటాన్, బర్మా)
14. ఆక్విలేరియా మైక్రోకార్పా (ఇండోనేషియా, బార్నియో)
15. ఆక్విలేరియా పర్విఫోలియా (ఫిలిప్పీన్స్ (లుజాన్))
16. ఆక్విలేరియా రోస్ట్రేట్ (మలేషియా)
17. ఆక్విలేరియా రుగోస్ (పపూవా న్యూ గయానా)
18. ఆక్విలేరియా సైనిసిస్ (చైనా)
19. ఆక్విలేరియా సబ్ ఇంటిగ్రా (థాయిలాండ్)
20. ఆక్విలేరియా అర్దానిటెన్సిస్ (ఫిలిప్పీన్స్)
21. ఆక్విలేరియా యున్నానెన్సిస్ (చైనా)
అగర్ వుడ్ సాగుకు వీలైన నేల, వాతావరణ పరిస్థితులు:
 సాధారణంగా సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎగువకు పైగా కొండ ప్రాంతాల్లో అగర్ వుడ్ చెట్లు పెరుగుతాయి. పసుపు, ఎరుపు పోడ్జోలిక్ నేల, మట్టి ఇసుక నేలల్లో ఇవి పెరుగుతాయి. సగటున 20 నుంచి 33 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. వర్షపాతం 2000 మిల్లీ మీటర్ల నుంచి 4000 మిల్లీ మీటర్లు ఉన్నచోట ఇవి పెరుగుతాయి. నేల సోలమ్ మందం 50 సెంటిమీటర్లకు పైగా ఉండాలి. వివిధ రకాల అడవులు, జీవావరణ వ్యవస్థలలో ఈ చెట్లు బతకగలవు. పర్యావరణ పరిస్థితులు నేల స్వరూప స్వభావాలను, సారాన్ని ప్రభావితం చేస్తాయి. మొక్క 20-33 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పెరగగలదు.  సాపేక్షంగా చూస్తే తేమ 77-85 మధ్య శాతంలో ఉండవచ్చు. కాంతి తీవ్రత 56-75 శాతం మధ్య ఉండాలి. కానీ, సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తున అంటే పరిస్థితుల్లో స్వల్పంగా తేడాపాడాలుంటాయి. అయితే, అగర్ వుడ్ ఉత్పత్తికి పర్యావరణ అంశాలు సర్వోన్నతంగా ఎలా ఉండాలనే దానిపై మరింత అధ్యయనాలు సాగవలసిన అవసరం ఉంది.
చదవండి: స్పిరులినా ఫార్మింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్
అగర్ వుడ్ చెట్ల పెంపకం:
కృత్రిమంగా జీవకణజాలాలోకి ఎక్కించటం అనే సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా అనేక మంది అగర్ వుడ్ చెట్ల పెంపకాన్ని చేపట్టవచ్చు. (సహజ సిద్ధమైన మార్గాల ద్వారా) కొన్ని దశాబ్దాలు పట్టే పనిని అంటే అగర్ వుడ్ సాధించడాన్ని ఈ సాంకేతిక పద్ధతుల ద్వారా స్వల్ప కాలంలోనే చేయవచ్చు. చక్కని ఫలితాలు పొందడానికి చక్కని నారు మొక్కలను ఎంచుకోవాలి.
ఆక్విలేరియా మొలకలు:
అగర్ వుడ్ అవసరాలు తీర్చుకునేందుకు, డిమాండ్ తట్టుకునే విధంగా ఎక్కువ మొక్కలను నాటడం చాలా ముఖ్యం. ప్రైవేటు నర్సరీల ద్వారా సాగును విజయవంతం చేయవచ్చు. ఆక్విలేరియాతో కూడిన విత్తనాన్ని గుర్తించడం సాగుకు వేసే మొదటి అడుగు అవుతుంది. విత్తన పరిపక్వత దశలోనే వ్యాప్తి ప్రక్రియ చోటుచేసుకుంటుంది. విత్తనం మీద పెంకు పగిలిన వెంటనే తక్షణం వ్యాప్తి జరగాలి. విత్తనాలు స్వల్ప కాలమే మనగలుగుతాయి. ఒకసారి వాతావరణానికి గురైతే స్వయంభరణ శక్తిని కోల్పోతాయి. సరైన ప్రణాళిక, మేనేజ్ మెంట్ నైపుణ్యాలు, నిల్వ పద్ధతుల ద్వారా ఆక్వా మొలకలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చు.
సాగు శ్రేణి:
వివిధ రకాల నేలల్లో, వేర్వేరు పరిస్థితుల్లో, ఉపాంతర నేలల్లో ఆక్విలేరియా చెట్లు పెరగగలవు. దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైన, ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఈ చెట్లను పంట పొలాల్లో కూడా పెంచవచ్చు. ఇంటి పెరడులో వేసుకోవచ్చు. ఇతర చెట్లతో కలిపి అంతర మొక్కలుగా వేసుకోవచ్చు.
అగర్ వుడ్ సాగులో కృత్రిమ జీవకణజాలం:
దీనిలో శిలీంధ్రాలకు చెందిన కణజాలం ఎక్కించడం మాత్రమే ఉంటుంది. రసాయనాలు కాదు. ఆక్విలేరియా దారువులోకి బూజును ప్రవేశపెడతారు. తక్కువ వ్యవధిలోనే (2-3 గంటల్లో) అది చెట్టులోని అన్ని భాగాలకు చేరుతుంది. దాంతో చెట్టుపై  గంట్లు  ఏర్పడతాయి. కొద్ది నెలల తర్వాత ఆ గంట్ల చుట్టూ సర్జరస కలప ఏర్పడుతుంది.  చెట్టు వేర్లు, మోడు, కొమ్మల వంటి భాగాలపై ఇవి ఏర్పడతాయి. కొద్ది రోజులపాటు ఇలా వ్యవహరించిన తర్వాత అన్ని కొమ్మల అడ్డుకోతలను మనం గమనించవచ్చు. నాలుగు నెలల తర్వాత చెట్టులో మనకు రెజినస్ కలప కనిపిస్తుంది. మంటలో ఆ కలపను కాల్చినపుడు మృదువైన సెంటు లభ్యమవుతుంది. ఆక్విలేరియా చెట్టు దగ్గర తవ్వి వేర్ల నుంచి కూడా రెజిన్ ను వేరు చేయవచ్చు.
అగర్ వుడ్ సాగులో నేలను సిద్ధం చేసి మొక్కలు నాటడం:
ముందు జీవావరణ పరిస్థితులను మదింపు చేయడం ముఖ్యం. అప్పుడే ఏ జీవ జాతికి చెందిన మొక్క బతికిబట్టకట్టగలదో ఎంచుకోవడం కుదురుతుంది. నాటిన 3 నుంచి 4 ఏళ్ళ తర్వాత చాలా మొక్కలు చనిపోవడం చూస్తున్నారు. నీరు నిల్వ ఉండిపోవడం వల్ల అలా జురుగుతోందని, దానికి నేల, వాతావరణం కారణం కాదని గుర్తించారు.  చెట్టు మాడిపోకుండా ఉండడం కోసం వాలు ప్రాంతాలలో మొక్కలు నాటడం చేయవచ్చు. మొలకలు 60-90 సెంటిమీటర్ల ఎత్తు వచ్చిన తర్వాత వాటిని నేలలో నాటవచ్చు. ఇంకా ఎక్కువ వయసు మొలకలైతే పాలీ సంచి పెద్దది కాకపోతే లోపల వేర్లు రింగులుగా ముడుచుకుపోతాయి. కనుక వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. చిన్న పాలి సంచిలోని మొలకలను, 120 సెంటిమీటర్లకన్నా పొడవు ఉన్న మొలకలను నివారించుకోవడం మంచిది.
దిగువ పద్ధతిని అనుసరిస్తే మొక్క బతికే అవకాశం  99 %   ఉంటుంది:
గొయ్యిని 40x40x40  కొలతలతో సిద్ధం చేయాలి. వర్షపు నీరు వెళ్ళేట్లు, ఎండ తగిలేట్లు దాన్ని వదిలేయాలి. వేర్లు పెరగడానికి ఆక్సిజన్ నేల సాయపడుతుంది. నేల గట్టిగా ఉంటే, నేల మిశ్రమాన్ని సడలింపజేసేందుకు కోకో పీట్ ను జోడించవచ్చు. కోకో పీట్ లో ఆక్సిజన్ గుణాలు బాగా ఉంటాయి. ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ (టి.ఎస్.పి), డై అమోనియం ఫాస్ఫేట్ (డి.ఏ.పి)ల నుంచి భాస్వరాన్ని గ్రహించవచ్చు. అలాగని ఎక్కువ మోతాదులో వాడితే మొలక దెబ్బతింటుంది. ఇవి తేలిగ్గా ద్రవరూపం పొంది, మట్టిలో వెంటనే కలిసిపోయి అందుబాటులో ఉన్న భాస్వరాన్ని మొక్కకు విడుదుల చేస్తాయి. కీటకాల దాడిని పరిమితం చేసేందుకు 20 శాతం ఫనదన్ వేయవచ్చు.  సేంద్రియ ఎరువుగా 15 శాతం ఆవు పేడను వేయవచ్చు.  గోతిని తగు స్థాయిలో పూడ్చి, ఉపరితలానికి 2 అంగుళాల ఎత్తున ఉండేట్లు మొలకను నాటాలి. పాలీ సంచీని తీసేసి మొలకను గోతిలో ఉంచవచ్చు. నీటి లభ్యత మెరుగయ్యే విధంగా మొలక చుట్టూ మెత్తని మట్టిని పరచవచ్చు.
అగర్ వుడ్ సాగుకు ఆకుపెంట, ఎరువుల అవసరం:
నేల బిగువును సడలించేందుకు కోకో పీట్ ను జోడించవచ్చు. దానిలో ఆక్సిజన్ గుణాలు ఎక్కువ. ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ (టి.ఎస్.పి), డై అమోనియం ఫాస్ఫేట్ (డి.ఏ.పి)ల నుంచి భాస్వరాన్ని గ్రహించవచ్చు. అలాగని ఎక్కువ మోతాదులో వాడితే మొలక దెబ్బతింటుంది. ఇవి తేలిగ్గా ద్రవరూపం పొంది, మట్టిలో వెంటనే కలిసిపోయి అందుబాటులో ఉన్న భాస్వరాన్ని మొక్కకు విడుదుల చేస్తాయి. కీటకాల దాడిని పరిమితం చేసేందుకు 20 శాతం ఫనదన్ వేయవచ్చు. సేంద్రియ ఎరువుగా ఆవు పేడ పనికొస్తుంది.
అగర్ వుడ్ సాగులో పంటకోత మెళకువలు:
పంట కోతలోకి ఎంపిక, ఉపయోగకరమైన నరికివేత ప్రక్రియ, ఎవరు వేటిని సేకరిస్తారో (స్థానికమైనవి, దూర ప్రాంతాలకు చెందినవి) వర్గీకరించుకోవడం, ఏయే వర్తకులకు ఏవేవి అవసరమో చూసుకోవడం వంటివి వస్తాయి. అగర్ వుడ్ లో పంట కోత తాత్కాలికంగాను లేదా శాశ్వతమైనదిగాను చేపట్టవచ్చు. సేకర్తలు వారి ఆదాయానికి అగర్ వుడ్ పైనే ఆధారపడతారు. క్రెడిట్ వ్యవస్థ ద్వారా వారు దళారులతో ముడిపడి ఉంటారు. దళారులు ఒక్కొక్కరికి సగటున 50-100 మంది సేకర్తలతో సంబంధాలుంటాయి. వారు స్వతంత్రంగాను వ్యవహరించవచ్చు లేదా ఈ దళారులు తిరిగి ఒక వర్తకునిపై ఆధారపడి ఉండవచ్చు. అగర్ వుడ్ ను స్థానికంగా ఔషధాల తయారీ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. కానీ, ఈ అధ్యయనం సందర్భంగా సంకలనపరచిన సమాచారం ఆధారంగా చూస్తే, దిగుబడిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతున్నట్లు తేలుతోంది.
అగర్ వుడ్ దిగుబడి:
70 కిలోల కలప నుంచి తీసే మొత్తం తైలం 20 మిల్లీ లీటర్లకు మించదు. ఆక్విలేరియా తెగకు చెందిన సుమారు 20 రకాల చెట్లు అగర్ వుడ్ ను అందివ్వగలవు. ఒక్కో చెట్టు నుంచి సగటున సుమారుగా 4 కిలోల అగర్ వుడ్ లభిస్తుంది. ప్రస్తుత ధర రూ. 50,000 నుంచి రూ. 2 లక్షల వరకు ఉంది. ఒక్కో అగర్ వుడ్ చెట్టు నుంచి సుమారుగా 1 లక్ష రూపాయలు లభిస్తాయని భావించవచ్చు.